పవన్, సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ షురూ

పవన్, సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలు పెట్టారు. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ వేడుకకు సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయ్యాయి. బ్లాక్ హుడీ, ఖాకీ ప్యాంట్ తో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. పవర్.. ఇదే వింటేజ్ లుక్ తో వస్తే ఫ్యాన్స్ పక్కా మ్యాజికల్ ఎంటర్ టైన్మెంటే అంటూ నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు. టైటిల్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చిత్ర బృందం ప్రకటించింది.