OG Box Office: బాక్సాఫీస్పై ‘ఓజీ’ దండయాత్ర.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల జోరు.. 2025లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

OG Box Office: బాక్సాఫీస్పై ‘ఓజీ’ దండయాత్ర.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల జోరు.. 2025లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్పై దండయాత్ర కొనసాగిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 25న) థియేటర్లలో రిలీజైన మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.91 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బుధవారం ప్రీమియర్స్ మరియు డే1 గురువారం వసూళ్లు కలుపుకుని రూ.91 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే తెలుగులో రూ.20.25 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 2025లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా ఓజీ నిలిచింది.

2025 ఏడాదిలో రిలీజైన కూలీ (రూ.65 కోట్లు), ఛావా (రూ.31 కోట్లు), సైయారా (రూ.21.5 కోట్లు) వంటి పెద్ద చిత్రాలను  ఓజీ అధిగమించింది. ఇకపోతే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.170 కోట్లకిపైగా గ్రాస్ మార్కును అధిగమించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరికాసేపట్లో మేకర్స్ నుంచి గ్రాస్ వసూళ్ల ప్రకటన రానుంది.  

ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం,

ఓజీ ఫస్ట్ డే (సెప్టెంబర్ 25న) ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.70.75 కోట్ల నెట్ సాధించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారా రూ.20.25 కోట్లు వసూళ్లు చేసింది. ఈ విధంగా ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం వసూళ్లు కలుపుకుని రూ.91కోట్ల నెట్ చేసింది. తెలుగులోనే అత్యధికంగా రూ.70 కోట్లు సాధించి సత్తా చాటుకుంది ఓజీ.

OG తెలుగులో 69.35% థియేటర్ ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసింది. ఆ తర్వాత తమిళంలో 18.36%, హిందీలో 10.37% మరియు కన్నడలో 9.19% ఉన్నాయి. ఈ చిత్రం భారతదేశం అంతటా తెలుగులో 4,161 షోలు ప్రదర్శించబడింది. తమిళంలో 226 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడింది, హిందీలో 336 షోలు పడ్డాయి.