
దసరా పండగ, ఆయుధ పూజను పురస్కరించుకుని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త మూవీ ఓజీ నుంచి.. సరికొత్త లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ అయితే ఫ్యాన్స్ ను మత్తెక్కించేస్తుంది. చాలా సింపుల్ గా.. ఎంతో పవర్ ఫుల్ గా ఉందీ లుక్. జస్ట్ పవన్ చూపులతోనే పోస్టర్ బయటకు రావటం ఆసక్తి రేపుతోంది.
Aslo Read :- ప్రగతి భవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు
వేటాడే సింహం చూపుల్లా.. ఉన్న పవన్ కల్యాణ్ ముఖంతో దసరా పోస్టర్ ఉంది. పవన్ చూపులతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్యాప్షన్స్, డైలాగ్స్.. ఓవరాక్షన్స్ ఏమీ లేకుండా.. చాలా సింపుల్ గా తన లుక్స్ తోనే ఓజీ మూవీకి హైప్ క్రియేట్ అయ్యింది అని చెప్పొచ్చు. దసరా పండగ రోజు.. ఓజీ నుంచి వచ్చిన పవర్ స్టార్ లుక్ అయితే ఫ్యాన్స్ ను పిచ్చెక్కించేస్తోంది.
His eyes are more powerful than any weapon. ???
— DVV Entertainment (@DVVMovies) October 23, 2023
Wishing you all a very Happy #AyudhaPooja & #VijayaDasami #FireStormIsComing #TheyCallHimOG pic.twitter.com/m8rdXNBPqD
ముంబై గ్యాంగ్ స్టర్ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ గ్లింప్స్ మూవీ అంచనాలను భారీగా పెంచింది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటున్నారు.