
పవన్ కల్యాణ్ మళ్లీ విడాకులు తీసుకోబోతున్నారు.. భార్య అనా లెజ్నోవాతో విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి జనసేన పార్టీ చెక్ పెట్టింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్.. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం చేశాయి. దీనిపై ఇప్పటి వరకు నోరు తెరవని పవర్ స్టార్.. ఇప్పుడు తన పార్టీ జనసేన అధికారిక ట్విట్టర్ నుంచి జులై 5వ తేదీ సాయంత్రం ఓ పోస్టు పెట్టి.. విష ప్రచారానికి ముగింపు పలికారు. తన ఇంట్లో.. భార్యతో కలిసి పూజలో పాల్గొన్న ఫొటో సైతం విడుదల చేశారు పవన్ కల్యాణ్.
ట్విట్ సారాంశం ఇదీ:
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, శ్రీమతి అనా కొణిదెలగారు వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కల్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.. ఇలా ట్విట్ చేసింది జనసేన పార్టీ అఫిషియల్ ట్విట్టర్.
విడాకుల ప్రచారానికి ముగింపు:
తెలుగు మీడియానే కాకుండా జాతీయ స్థాయి మీడియా కూడా పవన్ కల్యాణ్ మళ్లీ విడాకుల అంశాన్ని హైలెట్ చేశాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన యాగాలు, హోమాలతోపాటు.. అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి ఒంటరిగా హాజరయ్యారు. గతంలో ఏ హోమం, యాగం చేసినా జంటగా పాల్గొనే పవన్ కల్యాణ్.. కొన్ని నెలలుగా ఒంటరిగా కనిపించటంతో.. విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరిగింది. భార్య అనా రష్యా వెళ్లిపోయిందని.. మరో పెళ్లి అంటూ విష ప్రచారం చేశారు కొందరు. జాతీయ స్థాయిలో ఇది హైలెట్ కావటంతో.. జనసేన పార్టీ అధికారికంగా ఈ విషయంపై.. ట్విట్ రూపంలో సమాధానం చెప్పినట్లయింది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023
మొత్తంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇలాంటి క్లారిటీ కోసం వెయిట్ చేసిన అభిమానులకు కూడా ఊరట ఇచ్చే ట్విట్ ఇది..