క్లాసిక్ తొలిప్రేమ రీ రిలీజ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ రచ్చ

క్లాసిక్ తొలిప్రేమ రీ రిలీజ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ రచ్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా వచ్చిన తొలి ప్రేమ మూవీ రీ రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా జూన్ 30న రీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. పవన్ కేరీర్ లోనే మాస్టర్ పీస్ గా నిలిచిన ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

1998లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేమ కథా చిత్రాలలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇక సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందుకే ఈ క్లాసిక్ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో ప్రసారమైనా మంచి trp ని సాధిస్తుంది.  ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో  కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. 

ఇక దేవా అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మనసే.. నా మనసే, ఏమి సోదరా.. మనసుకు ఏమయిందిరా వంటి పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ లోకి రానుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తందో తెలియాలంటే జూన్ 30 వరకు ఆగాల్సిందే.