
యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujeeth).. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ OG. లేటెస్ట్ గా రిలీజైన బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. ఈ మూవీ తమిళ వినోదయ సీతంకు రీమేక్ అనే విషయం తెలిసిందే. పవన్ నుంచి వచ్చిన గత మూడు చిత్రాలు రీమేక్ కావడం..ఆ స్క్రిప్ట్ ల వెనుక డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) ఇన్వాల్వ్ మెంట్ ఉండటం తెలిసిందే.
ఆయన కథలు విని ఒకే చేస్తేనే..పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ వినకుండా ఒకే చేసేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ విజన్ మీద పవన్ కళ్యాణ్ కు అంత నమ్మకం ఉండటమే మెయిన్ రీసన్. కానీ వకీల్ సాబ్,బిల్యా నాయక్, బ్రో మూవీస్ లో.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ విషయంలో పవన్ ఫ్యాన్స్ డిస్సపాయంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ నుంచి వచ్చే లేటెస్ట్ మూవీస్ పై.. ఫ్యాన్స్ ఫోకస్ పెడుతున్నారు.
ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ మూవీని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అయితే ఓజీ సినిమా లో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకి ఉందనేది తెలుసుకుంటున్నారు. సుజీత్ డైరెక్షన్ పై ఫ్యాన్స్ కు విపరీతమైన క్రేజీ ఉంది. గతంలో ప్రభాస్ తో తీసిన సాహో మూవీ సౌత్ లో రికార్డ్స్ వసూళ్లతో పాటు మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో త్రివిక్రమ్ హ్యాండ్ OG మూవీలో లేకపోవడమే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య త్రివిక్రమ్ పెన్ను లో పవర్ తగ్గిందనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.
ఓజీ మూవీ బౌండెడ్ స్క్రిప్ట్ ని సుజీత్ రెడీ చేసుకొని పవన్నీ ఒప్పించడం జరిగిందనీ సమాచారం. కానీ క్రియేటివ్ కాన్సెప్ట్ విషయాల్లో సుజీత్ కు కొన్ని సలహాలు, సూచనలు త్రివిక్రమ్ ఇచ్చి ఉంటారని తప్ప..స్క్రీన్ ప్లే విషయంలో ఇన్వాల్వ్ మెంట్ లేదని టాక్ వినిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను సజెస్ట్ చేయడంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఉందని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. రోజురోజుకీ అంచనాలు పెంచేస్తున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.