
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan kalyan), హరీశ్ శంకర్(Harish Shankar.S) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. అయితే, గత కొంతకాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందనే వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు.
తాజాగా మత్తు వదలరా 2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ నీల్ మూవీస్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే పవన్‌కల్యాణ్‌ను కలిశాను. ఉస్తాద్ కోసం పవన్ డేట్లు ఇచ్చారని, కొద్ది వారాల్లో షూటింగ్ కూడా మొదలు కానుందని తెలిపారు. అంతే కాదు..సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ అప్ డేట్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది. జనవరి 2025 కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ 31 మూవీగా రాబోతున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ షురూ కానుందని అప్డేట్ ఇచ్చారు. NTR31పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.దీంతో పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే, పుష్ప-2 సినిమా డిసెంబరు 6న కచ్చితంగా రిలీజ్ అవుతుందన్నారు.