Saripodhaa Sanivaaram Box Office: నాని సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే?

Saripodhaa Sanivaaram Box Office: నాని సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది.

ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం (ఆగస్ట్ 29న) థియేటర్లలలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం. 

ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్:

సరిపోదా శనివారం ఇండియా వైడ్గా ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే..రూ. 8.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అలాగే ఫస్ట్ డే అయిన గురువారం (ఆగస్ట్ 29) తెలుగులో ఓవరాల్‌గా 53.54 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

Also Read :- శ్వాగానిక వంశానికి స్వాగతం

ఓవర్సీస్‌ కలెక్షన్స్:

అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చిందట. ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్ రెండు కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి రూ.8 కోట్లకుపైగా గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా..తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తారుగానే జరిగిన..దానికి మించి థియేటర్లలోకి జనాలు వచ్చినట్లు పలు ట్రేడ్ సంస్థలు రిపోర్ట్స్ అందిస్తున్నాయి. 

ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌:

అయితే, ఈ లెక్కన ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌కు రూ. 11 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండగా..ఆఫ్‌లైన్‌ ద్వారా రూ. 12 నుంచి 16 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. దీంతో మొదటిరోజు సరిపోదా శనివారం మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.22 నుంచి 24 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యే అవకాశం ట్రేడ్ వర్గాల సమాచారం.

దసరా ఓపెనింగ్‌ కలెక్షన్స్

అయితే  సరిపోదా శనివారం సినిమా..బిగ్గెస్ట్ ఓపెనర్ దసరా మూవీ భారీ ఓపెనింగ్‌ను మాత్రం టచ్ చేయలేకపోయింది. 2023లో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ విడుదలైన దసరా రూ. 23.20 కోట్ల నెట్‌తో కలెక్షన్స్ షురూ చేసింది.ఇక వచ్చేది వీకెండ్ అవ్వడంతో సరిపోదా శనివారం కలెక్షన్స్ రోజురోజుకు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది.