Ustaad Bhagat Singh Box Office: నెగటివ్ టాక్ ఎఫెక్ట్.. రెండో రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్లు..

Ustaad Bhagat Singh Box Office: నెగటివ్ టాక్ ఎఫెక్ట్.. రెండో రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్లు..

పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించారు. అయినప్పటికీ.. కథ, కథనం పాత పచ్చడిలా ఉందంటూ సగటు సినీ ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి రోజు పెద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధించలేకపోయింది. కనీసం రెండో రోజు కూడా ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయిందంటూ ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. 

ఉస్తాద్ భగత్ సింగ్ రెండు రోజుల వసూళ్లు:

Sacnilk.com రిపోర్టు ప్రకారం: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే సుమారు రూ.48 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు శుక్రవారం నాడు (మార్చి 20) కేవలం రూ.9.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే చేసి నిరాశపరిచింది. దీంతో రెండు రోజుల ఇండియా నెట్ వసూళ్లు రూ.44 కోట్లకు చేరింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ లోనూ పెద్దగా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టలేకపోయినట్లుగా సమాచారం. 

ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 550K డాలర్లు (ఇండియా కరెన్సీలో రూ.5.17 కోట్లు) రాబట్టింది. న్యూజిలాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి తదితర దేశాలతో వచ్చిన వసూళ్లతో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు రూ.7 కోట్లు మాత్రమే వచ్చాయి. ఓవర్సీస్‌లో వచ్చిన గ్రాస్ + ఇండియా కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.59 కోట్ల వసూళ్లు సాధించింది. 

OG చిత్రంతో పోలిక:

పవన్ కళ్యాణ్ గత చిత్రం OG ఓపెనింగ్ విషయంలో భారీగా రాణించింది. ఆ చిత్రం మొదటి రోజే రూ. 63.75 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు కూడా రూ.17.85 కోట్లు సాధించింది. అలాగే వీకెండ్‌లో స్థిరమైన కలెక్షన్లు సాధించి, మొత్తంగా సుమారు రూ. 295 కోట్ల గ్లోబల్ గ్రాస్ అందుకుంది. దీనితో పోలిస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్టింగ్ వసూళ్లు తక్కువగా ఉండటం, రెండో రోజు భారీ డ్రాప్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

వీకెండ్‌పై ప్రభావం:

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది ఫెస్టివల్ సీజన్‌తో కలిసి రావడం ప్లస్ పాయింట్ అయినప్పటికీ, మొదటి రెండు రోజుల నెగటివ్ టాక్ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. వీకెండ్‌లో పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సవాల్‌గా కనిపిస్తోంది. చివరికి ఏమవుతుందో చూడాలి!!