ఉస్తాద్ లుక్లో పవర్ స్టార్.. ఈసారి ఫ్యాన్స్కు పూనకాలే

ఉస్తాద్ లుక్లో పవర్ స్టార్.. ఈసారి ఫ్యాన్స్కు పూనకాలే

ఇది కదా పవన్ కళ్యాణ్ లుక్ అంటే.. ఇది కదా పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే.. లవ్ యూ పవన్ అన్నా.. లవ్ యూ హరీష్ అన్నా. ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాటలు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పవన్ పవర్ఫల్ లుక్ లో ఉన్నఈ పిక్ కు ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పవన్ ను ఎలా చూపించాలో హరీష్ కు మాత్రమే తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. పవన్ కళ్యాణ్ ను మేము ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే ప్రెజెంట్ చేసావ్.. ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవల్ అంటూ హరీష్ శంకర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ తాజా లుక్ తో సినిమాపై అంచనాలు  భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ లాగే మరో బ్లాక్ బాస్టర్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. మరి మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్న పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఇంకెన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో  చూడాలి మరి.