ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ఫ్రైజ్.. వకీల్ సాబ్ బొమ్మ అదిరింది

ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ఫ్రైజ్.. వకీల్ సాబ్ బొమ్మ అదిరింది

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది. పవన్ బర్త్ డే సందర్బంగా వకీల్ సాబ్ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీం. మోషన్ పోస్టర్ లో పవన్.. లా కోట్ వేసుకుని  నిలబడి ఉన్నాడు. ఒక కాలును టేబుల్ పై పెట్టి ఒక చేతిలో స్టిక్. మరో చేతిలో క్రిమినల్ లా అనే బుక్ ను పట్టుకుని సీరియస్ గా చూస్తున్న లుక్ అదిరిపోయింది.

వేణు శ్రీరామ్ డైరెక్షన్  లో వస్తున్నఈ మూవీని దిల్ రాజ్  నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ విక్టరీ సాధించిన  ఈ మూవీ పింక్ మూవీకి రీమేక్ గా వస్తుంది. నివేథ థామస్,అనన్య,అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ ఈ సమ్మర్ లో రావల్సి ఉండే.. కానీ కరోనా ,లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యంకావడంతో రిలీజ్ కాలేదు.