శరవేగంగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్

శరవేగంగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్

ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్‌‌‌‌తో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయినా  కమిట్ అయిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తిచేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. వీటిలో క్రిష్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ను వీలైనంత ఫాస్ట్‌‌‌‌గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. లాస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌‌ను స్టార్ట్ చేసిన క్రిష్.. ఇతర నటీనటులతో షూటింగ్ కొనసాగిస్తున్నాడు. మంగళవారం పవన్ కళ్యాణ్ సెట్స్‌‌‌‌లో జాయిన్ అయ్యారు.

భారీ సెట్‌‌‌‌లో పవన్‌‌‌‌పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్‌‌‌‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పీరియాడికల్ మూవీలో పవన్ బందిపోటుగా డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 17వ శ‌‌‌‌తాబ్దం నాటి మొఘ‌‌‌‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌‌‌‌కం నేప‌‌‌‌థ్యంలో జ‌‌‌‌రిగే క‌‌‌‌థ‌‌‌‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, త‌‌‌‌మిళ‌‌‌‌, కన్నడ, మ‌‌‌‌ల‌‌‌‌యాళ భాష‌‌‌‌ల్లో  విడుద‌‌‌‌ల చేయ‌‌‌‌నున్నారు.