రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బ్రో టీజర్.. ట్రెండింగ్లో టాప్

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బ్రో టీజర్.. ట్రెండింగ్లో టాప్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powerstar Pawal kalyan), మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ "బ్రో(Bro)". తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samutirakhani) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 29న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స వచ్చింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ టీజర్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత పవన్ ను ఎంటెర్టైనింగ్ రోల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఈ టీజర్ రిలీజై 36 గంటలు గడుస్తున్నా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటివరకు ఈ టీజర్ 31 మిలియన్ వ్యూస్, 513k లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో కొనసాగుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.