రెబల్ స్టార్ డైరెక్టర్తో పవర్ స్టార్ కొత్త మూవీ

రెబల్ స్టార్ డైరెక్టర్తో పవర్ స్టార్ కొత్త మూవీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పవన్ కల్యాణ్ కొత్త సినిమా రాబోతోందని ప్రకటించింది. ఈ విషయాన్ని డీవీవీ సంస్థ అధికారికంగా తెలియజేసింది. ఈ మూవీకి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తాడని తెలిపారు. రవి.కె.చంద్రన్ డీవోపీ అందిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. 

ఇక దీనికి సంబంధించి ఒ పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.