షర్మిల పార్టీ పెట్టాక స్పందిస్త

షర్మిల పార్టీ పెట్టాక స్పందిస్త

ఎవరైనా  పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందని..షర్మిలా పార్టీ విధివిధానాలు పెట్టాక స్పందిస్తానన్నారు. ఏపీ రాజకీయాలు, స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, శాంతి భద్రత పరిస్థితులు, దేవాలయాలపై దాడులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి కేంద్రహోంమంత్రి అమిత్ షా తో చర్చించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 18 వేల మంది ప్రత్యక్ష ఉపాధి, 20 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది, మొత్తంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అనేక మంది బలిదానాల ఫలితంగా ఈ విశాఖ ప్లాంట్ సాధించామన్నారు.  వైసీపీ తలచుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకోవచ్చు.. కాని ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. వచ్చే నెల 3,4 తేదీలలో బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..