
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన చిత్రం ‘మాయా పేటిక’. జూన్ 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
పాయల్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇది ఇంపార్టెంట్ సినిమా. పాయల్ రాజ్‌పుత్‌గా నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో ఇందులో కనిపిస్తాను. ఒక సెల్ ఫోన్ జర్నీకి సంబంధించిన కథతో, యూనిక్ కంటెంట్‌తో వస్తున్న చిత్రం. ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే చిత్రమవుతుంది’ అని చెప్పింది. ‘ఇదొక ఫోన్ బయోపిక్. ఇందులో చిన్న టౌన్‌లో ఉండే ముస్లిం యువకుడిగా నటించా’ అని చెప్పాడు విరాజ్.
దర్శకుడు మాట్లాడుతూ ‘అందరి జీవితాల్లో ఒక భాగమైన సెల్ ఫోన్ కథను, పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌లా తీశాం’ అన్నాడు. నిర్మాత శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ‘రొటీన్ ఫార్మెట్‌ను బ్రేక్ చేస్తూ కొత్త తరహా కథతో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.