ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తది : పాయల్​ శంకర్​

ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తది : పాయల్​ శంకర్​

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: తెలంగాణ రైతులను నిలువునా మోసం చేసిన కేసీఆర్​ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీజేపీ ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​అన్నారు. శనివారం ఆదిలాబాద్​ మండలంలోని రామాయి, రాంపూర్​ గ్రామాల్లో సోయా పంట నష్టపోయిన రైతుల పొలాలను ఆయన పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయనందుకే రైతులు నష్టపోయారని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పంట రుణమాఫీ సైతం చేయకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సోయా రైతులకు దిగుబడి లేక పెట్టుబడి సైతం రాలేని దుస్థితి నెలకొందన్నారు. ఫసల్ బీమా యోజన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు.

ఇప్పటికైనా రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకులు సుభాష్, మహేందర్, ముకుందరావు, సురేశ్, విశాల్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.