కర్ణాటకలో సీఎం ఫొటోతో పేటీఎం తరహాలో పేసీఎం పోస్టర్లు

కర్ణాటకలో సీఎం ఫొటోతో పేటీఎం తరహాలో పేసీఎం పోస్టర్లు

కర్నాటక బీజేపీ సర్కార్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది.  సీఎం బస్వరాజ్ బొమ్మై సర్కార్ లో కమీషన్లు ఇవ్వనిదే పనులు జరగడం లేదంటూ.... గోడలకు పోస్టర్లు అంటించారు. పేటీఎం తరహాలో.. పే సీఎం అంటూ, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫొటో ముద్రించిన ఫొటోలు బెంగళూరులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 

కర్నాటక ప్రభుత్వంలోని ఏ శాఖలో పనులు చేపట్టినా.. పాలకులు 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అంటించారు. పేసీఎం పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. 40శాతం కమీషన్ గవర్నమెంట్ అంటూ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ద్వారా.. బొమ్మై ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని ప్రచారం చేపట్టింది కర్నాటక కాంగ్రెస్ పార్టీ.