టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు

టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు
  •     ఐఆర్​సీటీసీ యాప్​లో కొత్త ఫీచర్​

న్యూఢిల్లీ : ఇక నుంచి ఐఆర్​సీటీసీ యాప్​/వెబ్​సైట్ ​ద్వారా టికెట్​ బుక్​ చేసుకున్నాక కన్ఫర్మేషన్​ రాకపోతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్​ కన్ఫర్మ్​ అయ్యాకే  కట్టొచ్చు. ‘ఆటోపే’ అనే ఈ ఫీచర్​ ఐఆర్​సీటీసీ ఐపేమెంట్​ గేట్​వేలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఇతర గేట్​వేల నుంచి డబ్బులు చెల్లిస్తే ఈ సదుపాయాన్ని ఉపయోగించడం సాధ్యం కాదు. టికెట్​కన్ఫర్మ్​ అయ్యాక యూపీఐ, క్రెడిట్​, డెబిట్​కార్డుల ద్వారా డబ్బులు కట్టవచ్చు. డబ్బు ఆటోమేటిక్​గా డెబిట్​అవుతుందని ఐఆర్​సీటీసీ చెబుతోంది. వెయిటింగ్​లిస్ట్​, తత్కాల్​లిస్ట్​లో ఉన్న వారికి ఆటోఫీచర్​ ఎంతగానో ఉపయోగపడుతుంది. టికెట్​రాకుంటే నాలుగైదు పనిదినాల్లో డబ్బు తిరిగి అకౌంట్లోకి వస్తుంది.