రిటైల్‌ షాపులే ఇక ఏటీఎంలు

రిటైల్‌ షాపులే ఇక ఏటీఎంలు

న్యూఢిల్లీ : మన ఇంటి పక్కన ఉండే రి టైల్‌ షాపులే ఇక మీదట మనకు అవసరమైనప్పుడల్లా  డబ్బు ఇచ్చే మైక్రో ఏటీఎంలుగా మారనున్నాయి. రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి లక్ష టెర్మినల్స్‌ ఏర్పాటు చే యాలని కొత్త తరం ఫిన్‌‌టెక్‌ కంపెనీ పేనియర్‌ బై నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌‌పీసీఐ), ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాం క్‌ లతో అగ్రిమెంట్‌‌ చేసుకుంది. ఇలాంటి రి టైలర్లు డెబిట్‌‌ కార్డులపై కూడా నగదు విత్‌ డ్రా చేసుకునే వీలు కల్పిస్తారని పేనియర్‌ బై తెలిపింది. సాఫ్ట్‌‌వేర్‌ మెయింట్‌‌నెన్స్‌ వ్యయం, ఎక్విప్‌‌మెంట్‌‌ అప్‌‌గ్రేడ్‌ వ్యయాలు పెరగడంతో దేశంలోని 50 శాతం ఏటీఎంలను మూసివేయనున్నట్లు కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌ ఏటీఎం ఇండస్ట్రీ (క్యాట్‌‌మి) ప్రకటించిన నేపథ్యంలో ఈ మైక్రో ఏటీఎంల ఏర్పాటు శుభవార్తే.

రోజు వారీగా నగదు లావాదేవీలు నిర్వహించే చిన్న చిన్న వ్యాపారస్తుల షాపుల్లోనే ఈ మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు. పీఓఎస్‌ ఆధార మైక్రో ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణా వ్యయాలు తక్కువేనని పేనియర్‌ బై సీఈఓ ఆనంద్‌‌ కుమార్‌ బజాజ్‌ తెలిపా రు. తమకున్న 7.5 లక్షల రి టైల్‌ టచ్‌ పాయింట్స్‌ ద్వారా ఇప్పటికే సేవలను లాంఛ్‌ చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి 50 లక్షల రి టైలర్లను ఏర్పాటు చేసుకోనున్నట్లు బజాజ్‌ తెలిపారు. అదేవిధంగా తొలి ఏడాదిలోనే లక్ష పీఓఎస్‌ ఆధార మైక్రో ఏటీఎంలనూ అందుబాటులోకి తేవాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.