పేటీఎంకి గుడ్ బై.. పెరిగిన గూగుల్ పే, ఫోన్ పే డౌన్ లోడ్స్

పేటీఎంకి గుడ్ బై.. పెరిగిన గూగుల్ పే, ఫోన్ పే డౌన్ లోడ్స్

ఫిబ్రవరి 29వ తేదీ నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేయాలన్న ఆర్బీఐ ఆంక్షలతో కస్టమర్స్ ఆందోళన పడ్డారు. దీంతో పేటీఎం యూజర్స్  డిజిటల్ పేమెంట్స్ జరుపుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఉన్న  గూగుల్ పే, పోన్ పే, భిమ్ యాప్ ల వైపు చూస్తున్నారు.  పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి  గూగుల్ పే, పోన్ పే, భిమ్  యాప్ ల డౌన్ లోడ్   సంఖ్య విపరీతంగా పెరిగింది.

PhonePe 

యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ డేటా ప్రకారం, PhonePe యాప్ డౌన్‌లోడ్‌లలో జనవరి  27 నుంచి  ఫిబ్రవరి 3 వరకు వారం రోజుల్లో  45 శాతం పెరిగింది. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత నాలుగు రోజుల్లో, PhonePe యాప్ డౌన్‌లోడ్‌లు 24.1 పెరిగాయి.  ఫిబ్రవరి 3 వరకు  ఫోన్‌పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లు పొందింది.

BHIM యాప్‌

 జనవరి 27 నుండి ఫిబ్రవరి 3 వరకు   భిమ్ యాప్ ల సంఖ్య 21.5 శాతం పెరిగింది.  డౌన్‌లోడ్‌లలో 50 శాతం పెరుగుదల ఉంది. నాలుగు రోజుల్లోనే యాప్ ను  లక్ష డౌన్ లోడ్ లు చేసుకున్నారు

Google pay

గూగుల్ పే జనవరి 27 నుంచి  ఫిబ్రవరి 3 వరకు ఆండ్రాయిడ్ డౌన్ లోడ్  సంఖ్యలో ఓ మోస్తారు పెరుగుదల ఉంది.  జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు యాప్ డౌన్ లోడ్ సంఖ్య 8.4 శాతం పెరిగింది.ఈ యాప్ డౌన్ లోడ్ లు కూడా నాలుగు రోజుల్లో లక్షకు పైగా  జరిగాయి.

Paytm  డౌన్లోడ్ లో తగ్గుదల

అదే విధంగా పేటీఎం యాప్ డౌన్ లోడ్ లు జనవరి 27 నుంచి  ఫిబ్రవరి 3 వరకు 24 శాతం తగ్గాయి. గూగుల్  ప్లే స్టోర్ లో కంపెనీ ర్యాంకింగ్ ఫ్రీ యాప్ డౌన్ లోడ్ లలో 18 నుంచి 40 వ స్థానానికి పడిపోయింది.