ఉదయం మాయం​.. రాత్రి ప్రత్యక్షం

ఉదయం మాయం​.. రాత్రి ప్రత్యక్షం

యాప్ గూగుల్ షాక్.. ప్లే స్టోర్ నుంచి అవుట్ & ఇన్

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: డిజిటల్ వ్యాలెట్‌‌ సహా పలు ఫైనాన్షియల్‌‌ సేవలు అందించే పేటీఎం యాప్‌‌కు గూగుల్‌‌ షాకిచ్చింది.  ప్రైవసీ రూల్స్‌‌ను, పాలసీలను పాటించడం లేదంటూ పేటీఎంతోపాటు ఫస్ట్‌‌ గేమ్స్‌‌ యాప్‌‌ను ప్లేస్టోర్‌‌ నుంచి తొలగించినట్టు ప్రకటించింది. తన యాప్స్‌‌ ద్వారా పేటీఎం గ్యాంబ్లింగ్‌‌కు అవకాశం ఇస్తోందని ఆరోపించింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన వన్‌‌97 కమ్యూనికేషన్స్‌‌ గూగుల్‌‌తో చర్చలు జరిపింది. రూల్స్‌‌ను పూర్తిగా పాటిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాత్రి పేటీఎం యాప్‌‌ తిరిగి ప్లేస్టోర్‌‌లో కనిపించింది. అయితే ఉదయం యాప్‌‌ బ్యాన్‌‌పై గూగుల్‌‌ స్పందిస్తూ గ్యాంబ్లింగ్​, క్యాసినో వంటి వాటిని ఏ దేశంలోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం మెయిన్‌‌ యాప్‌‌ను తొలగించడం ఇదే మొదటిసారి. పేటీఎం కంపెనీకి చెందిన ఇతర యాప్స్ వెల్త్‌‌ మేనేజ్‌‌మెంట్ యాప్, పేటీఎం యాప్, పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం ఇన్‌‌సైడర్‌‌‌‌లు ప్లే స్టోర్‌‌‌‌ నుంచి తీసేయలేదు. ‘‘మా గ్యాంబ్లింగ్ పాలసీ స్పష్టంగా ఉంది. స్పోర్ట్స్ బెట్టింగ్‌‌కు పాల్పడే అనధికారిక గ్యాంబ్లింగ్ యాప్స్‌‌కు సపోర్ట్ ఇవ్వడాన్ని ఒప్పుకోం. మనీ లేదా క్యాష్ ప్రైజెస్‌‌ గెలిచేలా పెయిడ్ టోర్నమెంట్స్‌‌కు పేటీఎం ఫ్యాంటసీ స్పోర్ట్స్‌‌ యాప్‌‌ అనుమతిస్తోంది. ఇలాంటివి మా పాలసీలకు వ్యతిరేకం. ఈ విషయంలో పేటీఎంను చాలా సార్లు హెచ్చరించినా రెస్పాన్స్‌‌ రాలేదు’’ అని తెలిపింది.   స్పోర్ట్స్‌‌ బెట్టింగ్‌‌ యాప్స్‌‌ ఇన్‌‌స్టాల్ చేసుకోవాలంటూ వచ్చే యాడ్స్​ను ఆపేయమని చాలా మంది డెవలపర్స్‌‌ను గూగుల్‌‌ కోరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ మార్కెట్లో గూగుల్‌‌ పే మార్కెట్‌‌ లీడర్‌‌. స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్లో అండ్రాయిడ్‌‌కు 99 శాతం వాటా ఉంది. ప్లేయర్లు రియల్‌‌గా మనీ పెట్టి, క్యాష్​ ప్రైజెస్‌‌ పొందే చాలా పాపులర్ ఆన్‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ డ్రీమ్11, విన్‌‌జెడ్‌‌ఓ, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్‌‌) వంటివి ప్లే స్టోర్‌‌‌‌లో  లేవు. అలాంటి కొన్ని యాప్స్‌‌ గతంలో ఉన్నా, ఆ తర్వాత  తొలగించారు.  రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ ను చాలా వరకు డైరెక్ట్‌‌గా ఆయా కంపెనీల అధికారిక వెబ్‌‌సైట్ల నుంచే డౌన్‌‌లోడ్ చేసుకోవాలి.

ఐపీఎల్‌‌ మొదలవడానికి ముందే…

ఐదు కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌‌ యూజర్లతో వ్యాలెట్‌‌ బిజినెస్‌‌లో పేటీఎం దూసుకెళ్తోంది.   గూగుల్‌‌ పే, వాల్‌‌మార్ట్‌‌ వ్యాలెట్‌‌ ఫోన్‌‌పేలతో పేటీఎం యాప్‌‌కు తీవ్రమైన పోటీ ఉంది.  ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ క్రికెట్‌‌ టోర్నమెంట్‌‌ శనివారం నుంచి మొదలవనున్న నేపథ్యంలోనే పేటీఎంపై గూగుల్‌‌ వేటు వేసింది. స్పోర్ట్స్‌‌ బెట్టింగ్‌‌పై ఇండియాలో బ్యాన్‌‌ ఉంది. కాకపోతే, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌‌లో తమ ఫేవరెట్‌‌ ప్లేయర్స్‌‌ను ఎంపిక చేసుకుని, తమ ప్లేయర్స్‌‌, టీమ్స్‌‌ బాగా ఆడితే అందుకు ప్రైజులు గెలుచుకోవడం ఇండియాలోని చాలా రాష్ట్రాలలో చట్టబద్దమే.

గూగుల్​ ఏమంటోంది..

రూల్స్‌‌ పాటించని యాప్స్‌‌ విషయంలో డెవలపర్‌‌కు తెలియచేసి, వారు వినకపోతే తొలగిస్తామని గూగుల్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ సూజన్‌‌ ఫ్రే ఒక బ్లాగ్‌‌ పోస్ట్‌‌లో తెలిపారు.  ఫ్యాంటసీ స్పోర్ట్స్‌‌ను ప్రమోట్‌‌ చేసే లేదా డిస్ట్రిబ్యూట్‌‌ చేసే కంపెనీల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌కు కంప్లెయింట్ చేసినట్లు ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌‌ (ఎఫ్‌‌ఐఎఫ్‌‌ఎస్‌‌) చెప్పుకుంటోంది. డ్రీమ్‌‌11 ఎఫ్‌‌ఐఎఫ్‌‌ఎస్‌‌ ఫౌండింగ్‌‌ మెంబర్‌‌ కూడా.  తాజా ప్రీమియర్ లీగ్‌‌(ఐపీఎల్‌‌)కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా నియమిస్తూ పేటీఎం ఫస్ట్ గేమ్స్ ఇటీవలే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఎనిమిది కోట్ల మంది యూజర్లను ఆకట్టుకున్న ఈ గేమ్స్‌‌ యాప్‌‌  ప్రమోషన్స్, మార్కెటింగ్ కోసం రూ.300 కోట్లను పేటీఎం  కేటాయించింది. పేటీఎం ఫస్ట్‌‌ గేమ్స్‌‌లో 50 దాకా గేమ్స్‌‌ అందుబాటులో ఉన్నా, పాపులారిటీలో మాత్రం ఫ్యాంటసీ గేమ్సే ఉండటం విశేషం.

పేటీఎం ఏమన్నదంటే…

కొత్త యూజర్లను సంపాదించుకోకుండా అడ్డుకునేందుకే గూగుల్‌‌ తమ యాప్‌‌ను ప్లే స్టోర్‌‌ నుంచి తొలగించిందని పేటీఎం సీఈఓ విజయ్‌‌ శేఖర్‌‌ శర్మ ఆరోపించారు. పేటీఎం ఫస్ట్‌‌ గేమ్స్‌‌ విషయంలో గూగుల్‌‌ అభ్యంతరాలను తెలిపిందని, కానీ పేటీఎం మెయిన్‌‌ యాప్‌‌ క్యాష్‌‌ బ్యాక్‌‌ ఇవ్వడం తప్ప వేరే ఏమీ చేయడం లేదని పేర్కొన్నారు. క్రికెట్‌‌ థీమ్‌‌తో స్క్రాచ్‌‌ కార్డులను యూజర్లకు అందిస్తున్నామని శర్మ తెలిపారు. ఇక నుంచి వీటిని ఇవ్వబోమన్నారు. కస్టమర్లకు క్యాష్‌‌బ్యాక్‌‌ ఇవ్వడం తమ తప్పయితే, గూగుల్‌‌ పే, వాల్‌‌మార్ట్‌‌ ఫోన్‌‌ పేలకూ అదే వర్తించాలని, అవి కూడా క్యాష్‌‌ బ్యాక్‌‌లు ఇస్తున్నాయని శర్మ చెప్పారు.ఇండియాలో యాప్‌‌ ఎకో సిస్టమ్‌‌లోని ప్రోబ్లమ్‌‌ ఇదేనని, చాలా మంది యాప్‌‌ల ఫౌండర్లు తన దగ్గర ఇదే వాపోయారని శర్మ వ్యాఖ్యానించారు.

గూగుల్‌ చెప్పిన కారణాలు ఇవి

పేటీఎం ప్రైవసీ రూల్స్‌ పాటించడంలేదు

స్పోర్ట్స్ బెట్టింగ్‌కు యాప్‌లకు అనుమతిస్తోంది

గ్యాంబ్లింగ్‌కు, క్యాసినోలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం

ఎన్నిసార్లు హెచ్చరించినా పేటీఎం పట్టించుకోలేదు

పేటీఎం వాదన ఇది

మాకు కొత్త కస్టమర్లు రాకుండా గూగుల్‌ ఇలా చేసింది

ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ ద్వారా క్యాష్‌బ్యాక్స్‌ మాత్రమే ఇస్తున్నాం

చాలా యాప్స్‌ ఇలా చేస్తున్నాయి. పేటీఎంను మాత్రమే టార్గెట్‌ చేశారు

మనదేశంలో డిజిటల్ బిజినెస్‌లకు చాలా సమస్యలు ఉన్నాయి

For More News..

హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌లో భారీ మార్పులు.. కస్టమర్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి