చింతించకుండా జరగబోయే ఆటలపై దృష్టి పెట్టు: PCB ఛైర్మన్

చింతించకుండా జరగబోయే ఆటలపై దృష్టి పెట్టు: PCB ఛైర్మన్

వరల్డ్ కప్- 2019 లో భాగంగా టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ పై ఆ దేశ క్రికెట్ అభిమానులు, ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. దీంతో సర్ఫరాజ్ మానసికంగా కుంగిపోయాడని, అతనిలో ఆత్మస్థైర్యం నింపేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనితో ఫోన్ చేసి మాట్లాడినట్టుగా.. పాకిస్థాన్ కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చీఫ్ సెలక్టర్ ఇషాన్ మనీ ఈ విషయంపై కెప్టెన్ సర్ఫరాజ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ తెలిపింది. ఓడిపోయినందుకు చింతించకుండా జరగబోయే నాలుగు మ్యాచ్ లపై దృష్టిపెట్టాలని చెప్పారట. మీడియాలో ప్రసారమయ్యే అనవసరమైన విషయాలపై స్పందించకుండా ఆట మీద ధ్యాస పెట్టాలన్నారట. ఈ సందర్భంలో దేశం మొత్తం టీమ్ కు అండగా ఉంటుందని, జరగబోయే కీలక మ్యాచ్ లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని ఇషాన్ సర్ఫరాజ్ కు సూచించినట్టు సమాచారం.