స్పీడ్ పెంచిన పాక్ క్రికెట్ బోర్డు.. బాబర్ స్థానంలో కొత్త కెప్టెన్ల ప్రకటన

స్పీడ్ పెంచిన పాక్ క్రికెట్ బోర్డు.. బాబర్ స్థానంలో కొత్త కెప్టెన్ల ప్రకటన

వరల్డ్ కప్ 2023 పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ బుధవారం కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తాను కెప్టెన్‌గా తప్పుకుంటున్నానని ఈ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్త కెప్టెన్లను ప్రకటించింది. 

గతంలో మూడు ఫార్మాట్లకు బాబర్ ఒక్కడే కెప్టెన్ కాగా, ఇప్పుడు పీసీబీ స్ప్లిట్ పద్ధతిని అనుసరించింది. అనగా ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ను నియమించింది. టీ20 సారథిగా ఆ జట్టు పేసర్, షాహిద్ అఫ్రిది అల్లుడు షాహీన్ అఫ్రీదీని నియమించిన పీసీబీ.. టెస్ట్ జట్టు పగ్గాలు ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించింది. వన్డే జట్టు బాధ్యతలు మాత్రం ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది.

కాగా, ఈ ప్రకటనతో త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.