
న్యూఢిల్లీ, వెలుగు: నూతన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గొప్ప మనసు చాటుకున్నారు. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయి ఢిల్లీ మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు ఎన్వీఎస్ఎస్ సూర్య ప్రకాశ్‌కు ఆర్థిక సాయం అందించారు. సూర్య ప్రకాశ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడన్న విషయం తెలుసుకున్న మహేశ్‌కుమార్ శుక్రవారం హాస్పిటల్‌కు చేరుకొని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు, ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు దాదాపు రూ.15 లక్షలకు పైగా అవసరం అవుతాయని తెలుసుకొని, పెద్ద మొత్తంలో సూర్యకు ఆర్థిక సహయం చేశారు.