
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జ్, కర్నాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోసు రాజు సమావేశమయ్యారు. సోమవారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బోసు రాజు పీసీసీ చీఫ్ మహేశ్‌ను అభినందించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాలన, ప్రజలనుంచి వస్తున్న స్పందనను మహేశ్ గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఏడేండ్ల పాటు తెలంగాణ ఇన్చార్జ్ గా పని చేసిన బోసు రాజును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్ రావు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.