బీర్కూర్ మండలంలోని పీడీఎస్ బియ్యం కోసం మిల్లు తనిఖీ

బీర్కూర్ మండలంలోని  పీడీఎస్ బియ్యం కోసం మిల్లు తనిఖీ

బీర్కూర్, వెలుగు : మండలంలోని కిష్టాపూర్​ గ్రామంలోని ఓ రైస్​ మిల్లులో పీడీఎస్​ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (ఏఎస్వో) స్వామి పరిశీలించారు. అనుమానం ఉన్న 32బస్తాల బియ్యాన్ని పరిశీలించారు. 

అనంతరం ఆ బియ్యంలో నుంచి శాంపిళ్లను సేకరించి, వీటిని డీఎం ఆఫీస్​కు పంపుతామన్నారు. మిల్లుకు ఆఫీసర్లు తాళం వేశారు. బియ్యం రిజల్ట్​ వచ్చే వరకు మిల్లును మూసి ఉంచాలన్నారు. ఆర్ఐ విజయ్ కుమార్, జీపీవో సంతోష్​, కాందార్లు తదితరులు ఉన్నారు.