మీలాంటోళ్ల వల్లే మేడం : వర్క్ ఫ్రం హోం అంటూ చెప్పుల షాపులో లాగిన్.. తిట్టిపోస్తున్నారు పాపం

మీలాంటోళ్ల వల్లే మేడం : వర్క్ ఫ్రం హోం అంటూ చెప్పుల షాపులో లాగిన్.. తిట్టిపోస్తున్నారు పాపం

ఇటీవల కాలంలో బెంగళూరు నగరం తరుచుగా వార్తల్లోకి ఎక్కడం కామన్ అయి పోయింది. పీక్ బెంగళూరు ట్రాఫిక్, ఐటీ ఎంప్లాయీస్ బిజీ షెడ్యూల్, మరోవైపు ఐటీ నగరంలో తాగునీటి సమస్య, అకాల వర్షాలు.. నీటమునిగిన కాలనీలు ఇలా అక్కడి వాతావరణ పరిస్థితులు వంటి హాట్ న్యూస్ తో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది.అయితే తాజాగా ఓ మహిళ తన బిజీ లైఫ్ ని తెలియజే యాల ను కుందో..లేక అనుకోకుండా జరిగిందో తెలియదు గానీ.. వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం చేస్తున్న ఆమె.. ఆఫీస్ మీటింగ్ కు కూడా చెప్పులు షాపింగ్ చేస్తూ అటెండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుతోంది.. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో తెగ కామెంట్లు పెడుతున్నారు. 

ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫొటోలో షాపింక్ కోసం వెళ్లిన ఓ మహిళ ఆఫీస్ మీటింగ్ కు హాజరవుతున్నట్లు కనిపిస్తుంది. ఒక చేతిలో చెప్పులు, మరొక చేతిలో ఆమె ల్యాప్ టాప్ ను పట్టుకొని ఆఫీసు మీటింగ్ లో పాల్గొన్నట్లు కనిపించింది. ఈ ఫొటోను చూపిన నెటిజన్లు హాస్యాస్పద కామెంట్లతోపాటు  ఐటీ ఉద్యోగుల పరిస్థితిపై కామెంట్లు పెట్టారు. 

నెటిజన్లు ఏమంటున్నారంటే.. 

వర్క్ ఫ్రం హోం సెషన్ లో ఉద్యోగులు నిర్లక్ష్యం గా ఉంటున్నారని ఆరోపిస్తున్న సమయంలో పనివేళ్లలో షాపింగ్ చేస్తున్న ఫొటో గురించి నెటిజన్లు చర్చించుకునేలా చేసింది. దాదాపు 500 మంది నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్లు రాశారు. ఒకే సమయంలో ఒక చేత్తో షాపింగ్, మరో చేత్తో ల్యాప్ టాప్ లో మీటింగ్ ను కవర్ చేస్తున్న ఆ మహిళ బిజీ గురించి చర్చకు పెట్టారు. 

ఆమె తీరు వర్క్ ఫ్రం హోం పాలసీలకు విరుద్ధం.. ఇలాంటి వారు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను రద్దు చేసేలా చేస్తున్నారు.. ఇలాంటి చర్యలు విషాదకరం అని ఓ నెటిజన్ రాశాడు.  ఇలాంటి చర్యలు మన పని విలువలను ఎత్తి చూపుతున్నాయని మరో నెటిజన్ రాశాడు. 

ఆమె చేసిందాంటో తప్పేం లేదు.. ఆమె మల్టీపుల్ టాస్కింగ్ చేస్తుంది. కొందరు ఆఫీసుల్లో ఉండి కూడా షాపింగ్ చేయడం లేదా అని ఆ మహిళను వెనుకేసుకొచ్చాడు. ఓ నెటిజన్ హాస్యాస్పదంగా స్పందించాడు.. బెంగుళూరులో మీటింగ్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి అనవసర మీటింగ్ లు నిర్వహిస్తున్న ఆర్గనైజర్ పై ఎలాంటి చెప్పు వేస్తే బాగుం టుంది అని ఆమె వెతుకుతుందని నవ్వుతూ రాశాడు.