శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యే–పావని దంపతులను వేదమంత్రాలతో ఆశీర్వదించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.