
- కుటుంబ సభ్యులతో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఖైరతాబాద్ గణనాథుడిని కోరుకున్నట్టు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ వినాయకుడిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ఇబ్బం దు లు పడ్డ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కుటుంబంతో కలిసి వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు బాగా చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకున్నానని చెప్పారు. భక్తులు గణనాథుడిని దర్శనం చేసుకుని సేఫ్‌గా ఇంటికెళ్లాలని ఆయన సూచించారు.