బీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే కేసులు.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఉద్యోగాలని వ్యాఖ్య
పెద్దపల్లి, వెలుగు: తమ సమస్యలు, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళన చేసిన విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీలు ప్రయోగించారని అన్నారు. దీనికి నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
బుధవారం మంథనిలో మంత్రులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొ న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నా.. బీఆర్‌ఎస్ మాత్రం ఏమీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ విమర్శించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, బీఆర్‌ఎస్ కుట్రలను సాగనివ్వబోమని అన్నారు.
కాక వెంకటస్వామి చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు పెట్టుకుని తనకు ఎంపీగా అవకాశం ఇచ్చారని.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాన ని చెప్పారు. రామగుండం-, మణుగూరు రైల్వే ట్రాక్ కోసం రూ.4 వేల కోట్లు మంజూరయ్యాయని, ఆర్‌ఓబీ, ఎఫ్‌ఓబీ తదితర మౌలిక వసతులకు రూ.500 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బీఆర్‌ఎస్ లీడర్ కేటీఆర్ యువతను రెచ్చగొట్టి కేసుల పాలు చేస్తున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఏఐ, ఏటీసీ వంటి శిక్షణ కేంద్రాలను ఏర్పా టు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే కేసులు.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఉద్యోగాలు, మంచి భవిష్యత్ దక్కుతాయని వ్యాఖ్యానించారు.
