దళితులకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. శనివారం (డిసెంబర్ 13) పార్లమెంటు ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎంపీ.. బీజేపీ, ఆరెస్సెస్ లపై విమర్శలు గుప్పించారు.
BJP, RSS లు దేశాన్ని మనుస్మృతి ఐడియాలజీతో నడిపిస్తున్నాయని విమర్శించారు. ఇది దేశానికి మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను ఎలా తిప్పికొట్టాలి అనేదానిపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న దళితుల సమస్యలపై అంబేద్కర్ స్పూర్తితో పోరాటం చేయాలనీ, దళిత సమాజానికి మేలు చేయాలని రాహుల్ గాంధీ సూచన చేశారని తెలిపారు.

