పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మానవత్వం చాటుకున్నారు. గ్యాస్ లీక్ తో పూరి గుడిసె దగ్ధమై రోడ్డున పడ్డ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.
పెదపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామంలో నవంబర్ 22న ఉదయం గ్యాస్ లీక్ కారణంగా పూరిగుడిసె దగ్ధమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆవుల సదయ్య వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. మాధవి తన చిన్న కుమారుణ్ని ఎత్తుకుని ఇంటి బయటకు పరుగెత్తగా, గ్రామస్తులు మంటలను ఆర్పి పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించారు.
