మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రానికి నాలుగు ఎయిర్ పోర్టులు రావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. విమానాశ్రయాలను సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీసులో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రామగుండం ఎయిర్ పోర్టు కల సాకారం కానుందన్నారు. బసంత్ నగర్ లో ఏయిర్ పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం రూ.55 లక్షలు మంజూరు చేయడంతో సర్వే జరిగిందన్నారు. దేశంలో యూరియా కొరత ఉందన్న ఎంపీ... ఇండియకు చైనా, ఉక్రెయిన్ నుంచి యూరియా దిగుమతి చేయడంలో కేంద్రం విఫలం అయిందని విమర్శించారు. రామగుండం ప్లాంట్ సరిగా నడపని కారణంగా 12 లక్షల టన్నులకు బదులు 9 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. దీంతో రైతాంగం ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు.
సెమీ కండక్టర్ యూనిట్ రాజకీయ కారణాలతో ఆంధ్రకు తీసుకెళ్లారని ఆరోపించారు. వెయ్యి కోట్లతో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఈ ప్రాంతానికి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. సింగరేణి రైటైర్డ్ కార్మికుల పెన్షన్ రూ. 10 వేలకు పెంచాలని పార్లమెంట్ లో డిమాండ్ చేశానన్నారు. మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ కారణంగా ప్ర యాణికుల ఇబ్బందులు తొలగిపోయాయని, రైల్వేకు కూడా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని తీసేసేం దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలనేదే బీజేపీ ఎజెండా అని విమర్శించారు.
►ALSO READ | కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు కాంగ్రెస్ నిరసన
