హైకోర్టుకు అభ్యర్థి.. ఆగిన ఎన్నిక.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట పంచాయతీ ఎన్నికలు

హైకోర్టుకు అభ్యర్థి.. ఆగిన ఎన్నిక.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట పంచాయతీ ఎన్నికలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట పంచాయతీ ఎన్నిక నిలిపివేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల11న ఎన్నిక జరగాల్సి ఉంది. పెద్దంపేట పంచాయతీ చెందిన చింతపట్ల సుహాసిని సర్పంచ్​అభ్యర్థిగా నామినేషన్​వేశారు. స్క్రూటినీలో అభ్యర్థి పేరు ఓటరు లిస్టు లేకపోవడంతో నామినేషన్​రిజక్ట్​ చేశారు. 

కానీ, ఆన్​లైన్​ఓటర్​లిస్టులో ఉంది. నామినేషన్​ తిరస్కరణపై కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో అభ్యర్థి సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన స్వీకరించిన హైకోర్టు పెద్దంపేట పంచాయతీ ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల15 కు వాయిదా  వేసింది.