పెద్దపల్లి జిల్లా రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అయితే ఎంపీ పర్యటనకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ వంశీకృష్ణ. అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురుతోనే స్థలాన్ని పరిశీలించారు ఎంపీ.
కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి ఎంపీ వంశీ కృష్ణ పలుమారు విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ వంశీకృష్ణ వచ్చారు. అయితే అధికారులు ఆసుపత్రి స్థలంలో ఎలాంటి ఏర్పాటు చేయలేదు..కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎంపీని అవమానపరిచారంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో పాటు, ఈఎస్ఐ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కార్మికుల సౌకర్యం ఆసుపత్రిని తీసుకువస్తానని చెప్పారు వంశీకృష్ణ.
