V6 News

Movie Climax Twist: పెద్ది, ఫౌజీ క్లైమాక్స్‌లపై బిగ్ టాక్.. కొత్త హిస్టరీ రాయబోతున్నాయా?

Movie Climax Twist: పెద్ది, ఫౌజీ క్లైమాక్స్‌లపై బిగ్ టాక్.. కొత్త హిస్టరీ రాయబోతున్నాయా?

తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “పెద్ది”, “ఫౌజీ” ముందున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే, విడుదలైన పోస్టర్లు, వీడియోలతోనే ప్రేక్షకుల్లో హైప్ పెంచేశాయి. ఈ క్రమంలోనే, ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదే “క్లైమాక్స్”. సినిమా అయిపోయాకా.. ప్రేక్షకుడితో పాటు ఇంటికెళ్లే క్లైమాక్స్. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చకు దారి తీసేలా ఈ క్లైమాక్స్‌లను రూపొందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎలా ఉండబోతున్నాయి?

ఈ రెండు సినిమాల క్లైమాక్స్ పోర్షన్స్ ఎవ్వరూ ఊహించని ట్విస్టులతో ఉండబోతున్నాయని టాక్. ఆడియన్స్కి ఎప్పటికీ గురుండిపోయేలా క్లైమాక్స్‌లపై భారీ ప్లానింగ్ జరుగుతుందట. ముఖ్యంగా చివరి 20–30 నిమిషాలను ప్రేక్షకులను కట్టిపడేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. “పెద్ది” విషయంలో, డైరెక్టర్ బుచ్చిబాబు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు షాకింగ్ ట్విస్ట్‌ను ప్లాన్ చేశాడని టాక్.

గతంలో బుచ్చి తెరకెక్కించిన ఉప్పెన క్లైమాక్స్ ఎంత ఇంపాక్ట్ చూపిందో తెలిసిందే. అదే స్థాయిలో, ఇంకా ఎక్కువగా మాట్లాడుకునేలా పెద్ది క్లైమాక్స్ ఉండబోతుందని సమాచారం. స్టోరీ సిట్టింగ్లో బుచ్చి చెప్పిన క్లైమాక్స్కు, చెర్రీ షాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలా ఉంటుందో చూడాలి. 

ఇక “ఫౌజీ” విషయానికి వస్తే, దర్శకుడు హను రాఘవపూడి కూడా క్లైమాక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన రూపొందించిన “సీతా రామం” సినిమా లాగా ఎమోషనల్ ఎలెమెంట్స్తో పాటు అనూహ్య ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే, రామ్ సీతలా ప్రేమ ఎలాంటి ఇంపాక్ట్ కలిగించిందో చూసాం. ఉత్తరాలతో ముడిపడిన ప్రేమను.. యుద్ధంలో రామ్ తనువు చాలించేలా ఇచ్చిన క్లైమాక్స్కు కంటతడి పెట్టని వారుండరు. అంతలా డిజైన్ చేశాడు హను. ఇక ఇప్పుడు “ఫౌజీ” విషయంలో కూడా అంతే ఇంపాక్ట్ ఇవ్వనున్నాడని టాక్. !

►ALSO READ | మత్స్యకారుల జీవితాలపై సినిమానే ‘తెరచాప’

ఇలా మొత్తానికి, ఈ రెండు సినిమాలు కేవలం స్టార్ హీరోల కారణంగా మాత్రమే కాకుండా, తమ క్లైమాక్స్‌ల ద్వారానే ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇపుడు ఈ క్రేజీ టాక్ తో రెండు సినిమాలపై భారీ చర్చ మొదలైంది. 

పెద్ది రిలీజ్:

బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే ఇటీవల ఈ చిత్రం వాయిదా పడుతుందనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. పెద్ది అస్సలు పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోన్ కాదంటూ.. ఏప్రిల్ 30నే థియేటర్లలోకి వస్తుందంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే, విడుదలకు ఇంకా 15 రోజులే ఉన్నప్పటికీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. అందువల్ల వాయిదా పడుతుందనే టాక్ అయితే నడుస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

దసరా కానుకగా ఫౌజీ!

ఫౌజీ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి కే 70 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

దర్శకుడు హను రాఘవపూడి తనదైన శైలిలో ఎమోషన్స్ పండిస్తూనే, యుద్ద సెన్నివేశాలను విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. క్లారిటీ రావాల్సి ఉంది.