
‘గేమ్ చేంజర్’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ చరణ్.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేశాడు. ఇకపై తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టడానికి రెడీ అయ్యాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులైంది. దీంతో ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ టీమ్ గుడ్ న్యూస్ చెబుతోంది.
ఈ నెల 20న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లో రూపొందుతున్న 16వ సినిమా ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. మరోవైపు ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించి కొన్ని క్రేజీ అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.