రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా శనివారం చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పాల్గొని ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నారు.
