హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలి

హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్​ను రూ.6 వేలకు పెంచాలని ఏంఆర్​పీఎస్, వీహెచ్​పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఆఫీస్​లను ముట్టడించారు.  జన్నారంలో ఏంఆర్పీఎస్ మండల ప్రెసిడెంట్ కొండుకూరి ప్రభుదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా పెన్షన్లు పెంచలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్​కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నేతలు కుంటాలలో తహసీల్దార్ కమల్ సింగ్​కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.