నిర్లక్ష్యం వద్దు.. సరిహద్దు రాష్ట్రాల నుంచి వైరస్

నిర్లక్ష్యం వద్దు.. సరిహద్దు రాష్ట్రాల నుంచి వైరస్

దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు తెలంగాణ డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) రమేష్ రెడ్డి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్ , కేరళలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కరీంనగర్ లో రెండు రోజుల్లో 33 కేసులు.. రావడంతో అధికారులు అలర్టయ్యారని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వైరస్ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న రమేశ్ రెడ్డి…కేసులు పెరిగే అవకాశాలు ఉండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

కరోనా ఇక లేదు అన్నట్లుగా… జనంలో నిర్లక్ష్యం పెరిగిందన్నారు DME రమేశ్ రెడ్డి. మాస్క్ లు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారన్నారు. వ్యాక్సిన్ వచ్చిందనే భావనలో జనం…మొదట్లో గొంతు నొప్పి వచ్చినా టెస్ట్ కు వచ్చేవారన్నారు. ఇప్పుడు జ్వరం, కోల్డ్ ఉన్నా టెస్ట్ కు రావడం లేదని తెలిపారు. దైర్యంగా ఉండడం మంచిదే కానీ.. మన నిర్లక్ష్యం కారణంగా ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు.

టెస్టింగ్ సెంటర్స్ దగ్గర క్యూ కూడా తగ్గిందన్నారు. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ లో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను గుంపులుగా కూర్చోబెడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కు ముందు చేసుకున్నట్లే… ఫంక్షన్ లు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లో ఉన్నాయంటున్న DME రమేశ్ రెడ్డి.. కేర్ తీసుకోకపోతే ప్రమాదం ఉందన్నారు.

గత కొన్ని రోజులుగా 200 వందల లోపులోనే కేసులు నమోదవుతున్నాయని…ఇప్పటి వరకు రాష్ట్రంలో 3లక్షల చేరువలో కేసులు ఉన్నాయన్నారు. నోడల్ సెంటర్ గా ఉన్న గాంధీలో 50 లోపే కరోనా రోగులు ఉన్నట్లు తెలిపారు DME రమేశ్ రెడ్డి.