కులం, మతం పేరుతో ఓట్లేసి ప్రజలు విసిగిపోయారు

V6 Velugu Posted on Nov 27, 2021

  • ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్

రాయ్ పూర్:  కులం, మతం పేరుతో ఓట్లు వేసి ఛత్తీస్ గఢ్ ప్రజలు విసిగిపోయారని ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అన్నారు. కులం, మతం పేరుతో ఓట్లేస్తే ఏమీ రాదని వారు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల జనంలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని భూపేష్ బాఘెల్ ధీమా వ్యక్తం చేశారు. 
 

Tagged cm, Congress party, chhattisgarh, Raipur, Bhupesh Baghel, Chief Minister Bhupesh Baghel

Latest Videos

Subscribe Now

More News