
- ప్రైవేట్ ఏజెన్సీలు స్లో
- ఎంజీబీఎస్, జేబీఎస్ల్లోనే ఫాస్ట్ సర్వీసు ఫెసిలిటీ
- 24 గంటల్లో పార్సిల్ డెలివరీ.. దాంతో కౌంటర్ల వద్ద క్యూ
- ప్రైవేట్ ఏజెన్సీలో ఇస్తే రెండు రోజులైనా నో డెలివరీ
హైదరాబాద్, వెలుగు: సిటీలో కార్గో, కొరియర్ ప్రైవేటు ఏజెన్సీసేవల స్పీడ్‌పై ఆర్టీసీ ఫోకస్ చేయడం లేదు. గతేడాది మొదట్లో ట్విన్ సిటీస్‌లో 20 కౌంటర్లతో సేవలు ప్రారంభించగా ప్రస్తుతం 190కి చేరాయి. కౌంటర్లు పెరిగినా సేవలు మాత్రం స్లోగానే ఉంటున్నాయి. ఇందులో 40 మాత్రమే ఆర్టీసీకి చెందినవి ఉండగా, మిగతావి ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. పార్సిల్‌పై వీటికి 15 శాతం కమిషన్ని ఆర్టీసీ అందిస్తోంది. అయినా ప్రైవేట్ ఏజెన్సీల సర్వీసుల్లో స్పీడ్ ఉండటం లేదు. పార్సిల్ ఇస్తే రెండు, మూడు రోజుల తర్వాత డెలివరీ అవుతున్నాయి. అదే ఎంజీబీఎస్, జేబీఎస్ బుకింగ్ కౌంటర్లలో పార్సిల్ అందజేస్తే 24 గంటల్లోపే డెలివరీ అవుతుండడంతో కస్టమర్లు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికే వెళ్తున్నారు. దీంతో అక్కడి కౌంటర్ల వద్ద క్యూ పెరుగుతోంది. సాయంత్రం సమయంలో ఒక్క పార్సిల్ ఇవ్వాలంటే గంట పాటు వెయిట్చేయాల్సి వస్తోందని జనం చెప్తున్నారు. ఇక్కడ కౌంటర్లు పెంచాలని కూడా కోరుతున్నారు.
సాయంత్రమైందంటే క్లోజ్
ఎంజీబీఎస్, జేబీఎస్ మినహా ఇతర ప్రాంతాల్లోని ఆర్టీసీ కౌంటర్లు, ప్రైవేట్ ఏజెన్సీల వద్ద పార్సిల్ ఇస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియడంలేదు. ఒక్కోసారి ఒకటి, రెండు రోజులు లేట్ అవుతోందని కస్టమర్లు అంటున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో 24 గంటల పాటు అందుబాటులో ఉంటుండగా మిగతా చోట్ల సాయంత్రం కాగానే క్లోజ్ చేస్తున్నారంటున్నారు. ఎమర్జెన్సీ అయితే ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు వచ్చి పార్సిల్స్ ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. 24 గంటలు ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నారు.
ప్రైవేట్ ఏజెన్సీల్లో ఎక్కువ వసూల్
ట్విన్ సిటీస్‌లోని ప్రైవేట్ ఏజెన్సీలు పార్సిల్బుకింగ్కు ఎక్కువగా డబ్బులు వసూల్ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ కౌంటర్లకు రావడానికి ఇది కూడా ఒక కారణమని కస్టమర్లు చెబుతున్నారు. అన్నిచోట్ల ఒకే రేట్లు, స్పీడ్‌గా సర్వీస్ ఉంటే ఆర్టీసీసేవలకు మరింత గుర్తింపు వస్తుందని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
బయట రేట్లు ఎక్కువ
2 పేజీల డాక్యుమెంట్‌ని జహీరాబాద్‌కి కొరియర్ చేయాలని అడిగితే రూ. 60 అవుతాయని, డెలీవరీకి రెండు రోజులు టైమ్ పడుతుందని చెప్పారు. ఎంజీబీఎస్‌కి వచ్చి రూ. 30కి కొరియర్ చేశా. కేవలం 24 గంటల్లో డెలీవరీ అయ్యింది. ఇక్కడ త్వరగా అవుతోందని కొత్తపేటనుంచి ఎంజీబీఎస్‌కి వచ్చా. ఎప్పుడూ ఇలాగే చేస్తున్నా. - రాహుల్, కొత్తపేట
త్వరగా అందకపోతుండగా..
నేను సేఫ్టీ మెటీరియల్ డీలర్‌ని. కార్గోలో డైలీ పార్సిల్స్ వేస్తా. మెటీరియల్ త్వరగా అందకపోవడంతో ఎప్పుడొస్తుందని కస్టమర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. దీంతో షేక్ పేట నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు వెళ్లి పార్సిల్స్ వేస్తున్నాం. త్వరగా వెళ్తుందని ఇంత దూరం రావాల్సి వస్తోంది. - నరేశ్ సాగర్, షేక్ పేట