ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవాళ్లు రైతులను బద్నాం చేస్తున్నరు: సుప్రీంకోర్టు

ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవాళ్లు రైతులను బద్నాం చేస్తున్నరు: సుప్రీంకోర్టు

ఢిల్లీలో వాయు కాలుష్యంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణను పున: ప్రారంభించింది. దేశ రాజధానిలో నెలకొన్న వాయు కాలుష్యంపై కోర్టులో తీవ్ర చర్చ జరిగింది. కోర్టు ప్రభుత్వంపై మండిపడింది. వ్యవసాయ వ్యర్థాలను కాల్చే వాటాపై  వార్షిక అధ్యయనాలు పొరుగు రాష్ట్రాలలో 4-10% మధ్య ఉండగా.. ఢిల్లీలో పొల్యూషన్ పెరిగే సమయానికి వ్యర్థాల్నికాల్చే రాష్ట్రాల వాటా 50% ఉంది.  దీనిపై విచారించిన న్యాయస్థానం... ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉన్నవాళ్లు రైతుల్ని బదనాం చేస్తున్నారని న్యాయస్థానం మండిపడింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. 

ఢిల్లీ కాలుష్యానికి రైతులను బాధ్యులను చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి రైతులు ఎలా కారణమో చెప్పాలంటూ మండిపడింది. ‘‘ఢిల్లీ ప్రజలు 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో కూర్చొని కాలుష్యానికి కారణం రైతులేనంటూ అభాండాలు వేస్తున్నారు. అసలు వారికున్న భూమితో రైతులకొచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా?’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు. నిషేధం ఉందని తెలిసినా బాణాసంచా కాలుస్తున్నామన్న విషయాన్నే అందరూ మరచిపోయారని అసహనం వ్యక్తం చేశారు. దీపావళి అయిపోయి 10 రోజులవుతున్నా టపాసులను ఇంకా ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకూ కొంత బాధ్యత ఉండాలన్నారు. ప్రతిదీ కోర్టు ఆదేశాలతోనే జరగడం సాధ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దీనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.
 

దీంతో పాటు కాలుష్య కట్టడికి కేంద్ర రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని మరోసారి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవడం మాని కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలంది. కాలుష్యంపై అత్యవసర సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలను జాబితా రెడీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర అధికారులను సోమవారం కోర్టు ఆదేశించింది. ఢిల్లీ మరియు చుట్టుపక్కల ఉన్న తమ ఉద్యోగుల కోసం కేంద్ర, రాష్ట్రాలు ఇంటి నుండి పని చేసేలా అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

 

CAQM జారీ చేసిన తొమ్మిది పేజీల ఉత్తర్వు కూడా నవంబర్ 21 వరకు కనీసం 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని NCR రాష్ట్ర ప్రభుత్వాలకు (ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్) సూచించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల్లో 50 శాతం మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఏక్యూఏం సూచించింది. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలివ్వడంతోపాటు ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది సిబ్బందిని ఇంటి నుంచే పని చేయించాలని సూచించారు.