న్యూస్‌పేపర్‌‌ ఎక్కువ సేపు చదువుతున్నరు

న్యూస్‌పేపర్‌‌ ఎక్కువ సేపు చదువుతున్నరు
  • పేపర్‌‌లో కరెక్ట్‌ న్యూస్‌ వస్తదనే నమ్మకంతోనే
  •  సర్వేలో చెప్పిన చాలా మంది రీడర్స్‌
  •  మినిమమ్‌ గంట చదువుతున్నరు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ వేళ ఇళ్లలోనే ఉంటున్న జనం న్యూస్‌పేపర్‌‌ను ఎక్కువసేపు చదువుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. న్యూస్‌పేపర్‌‌లో కరెక్ట్‌ న్యూస్‌, వెరిఫైడ్‌ న్యూస్‌ వస్తదనే నమ్మకంతో ప్రజలు ఎక్కువ సేపు చదువుతున్నరని ‘అవాన్సే ఫీల్డ్‌ అండ్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. మాములు రోజుల్లో యావరేజ్‌గా 22 నిమిషాలు పాటు న్యూస్ చదివితే.. లాక్‌డౌన్‌ టైంలో యావరేజ్‌గా 38 నిమిషాల పాటు చదువుతున్నరు. సర్వే చేసిన వాళ్లలో 40 శాతం మంది గంటకు పైగానే పేపర్‌‌ చదువుతున్నట్లు చెప్పారు. గతంలో వాళ్లంతా కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు చదివే వారని సర్వేలో చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ టైంలో 30 నిమిషాల పాటు పేపర్‌‌ చదివే వారి సంఖ్య 42 శాతం నుంచి 72 శాతానికి పెరిగినట్లు సర్వే చెప్తోంది. 15 నిమిషాల కంటే తక్కువ చదివే వారి సంఖ్య 14 నుంచి 3 శాతానికి పడిపోయింది. 42శాతం మంది రోజుకు చాలా సార్లు పేపర్‌‌ చదువుతున్నరని, ఒక్కో సెక్షన్‌ను ఒక్కోసారి చదువుతున్నారని సర్వేలో వెల్లడైంది. న్యూస్‌పేపర్లు, రీడర్స్‌ మధ్య బంధం గట్టిగా ఉందనే విషయం ఈ లాక్‌డౌన్‌ వల్ల తెలుస్తోందని సర్వే చేసిన సంస్థ చెప్పింది. “ న్యూస్‌పేపర్లు ఎసెన్షియల్‌ సర్వీస్‌. సరైన ఇన్ఫర్మేషన్‌ ఇచ్చే సోర్స్‌గా ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని సర్వే స్పష్టం చేసింది.