ప్రభావిత గ్రామాలను పట్టించుకోరా?

ప్రభావిత గ్రామాలను పట్టించుకోరా?
  • పబ్లిక్​ హియరింగ్​లో సింగరేణి తీరుపై గ్రామస్తులు, లీడర్ల నిరసన

కోల్​బెల్ట్​, వెలుగు: సింగరేణి బొగ్గు గనులు,   ప్రాజెక్టుల కోసం తమకు అన్నం పెట్టే  భూములను కోల్పోతున్నామని,   ప్రభావిత గ్రామాల్లో కనీస సౌలతులను కల్పించడంలేదని  మందమర్రి మండల పరిధి సింగరేణి ప్రభావిత గ్రామస్తులు ఆరోపించారు.   శంకర్​పల్లి, సారంగపల్లి, సండ్రోనిపల్లి, తురకపల్లి గ్రామాల్లో డెవలప్​మెంట్​ పనులకు సీఎస్​ఆర్​ఆర్(కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ)​ , డీఎంఎఫ్​టీ(డిస్ట్రిక్ట్​ మినరల్​ట్రస్ట్​ఫండ్​)  నిధులను ఇప్పించేందుకు సింగరేణి  కృషి చేయాలని డిమాండ్​ చేశారు.  మంగళవారం  మందమర్రి ఏరియాలోని కేకే–5 అండర్​ గ్రౌండ్​ సింగరేణి బొగ్గు  గని విస్తరణ,  మిగిలి ఉన్న బొగ్గు నిల్వలను  బయటకు తీసేందుకు  తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు  రీజియన్​ ఈఈ ​ లక్ష్మణ్​​ప్రసాద్​ నేతృత్వంలో పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా శంకర్​పల్లి సర్పంచ్​ సల్లూరి సదానందం, ఎంపీటీసీ ఎండీ నసీరుద్దీన్​, జడ్పీటీసీ రవి, పలువురు గ్రామస్తులు మాట్లాడారు.. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి  గ్రామాల ప్రజలందరూ సహకరిస్తున్నారని,  అయితే కార్మిక కాలనీల్లో జరిగినట్లుగా ప్రాజెక్టు  ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్నారు.  ఆర్కేపీ ఓసీపీ కారణంగా  బావుల్లో 300 నుంచి 400 ఫీట్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు.  నిరుద్యోగ యువతకు సింగరేణి ఓసీపీల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్​ చేశారు.  మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. కేకే5 గని విస్తరణకు అందరూ అంగీకరించినందుకు థ్యాంక్స్​ చెప్పారు.  ప్రభావిత గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు మేనేజ్​మెంట్​ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.   సమావేశంలో మంచిర్యాల అడిషనల్​ కలెక్టర్​  రాహుల్​,  బెల్లంపల్లి ఏసీపీ పి.సదయ్య, మందమర్రి సీఐ మహేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.