పారిశుద్ధ్య కార్మికుడిపై పూల వర్షం

పారిశుద్ధ్య కార్మికుడిపై పూల వర్షం

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్రం. లాక్ డౌన్ ప్రకటించడంతో వైరస్ కు భయపడి ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. అయితే కరోనా వైరస్ డేంజర్ అని తెలిసినా విధులు నిర్వర్తిస్తున్నారు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. వీరు అందిస్తున్న సేవలను అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు.

పంజాబ్ లోని పటియాలాలో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై జనం పూలజల్లు కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయపెడుతున్నా పారిశుద్ధ్య పని చేస్తూ పరిసరాలు స్వచ్చంగా ఉండేలా సేవ చేస్తున్న …కార్మికుడిని జనం చప్పట్లతో అభినందిస్తూ అతడిపై పూల వర్షం కురిపించారు. మరి కొందరు అతడి మెడలో డబ్బుల దండలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజల ఆరోగ్యంపై వీరు చూపిస్తున్న శ్రద్ధ హర్షనీయమంటున్నారు నెటిజన్లు.