
ఢిల్లీ ప్రజలకు కాలుష్యం ఎక్కడలేని తిప్పలు తెచ్చిపెడుతోంది. ఓ వైపు గాలి కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు నీటి కాలుష్యం కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీపావళి తర్వాత ఉత్తరాదిలో ఘనంగా జరుపుకునే పండుగ ఛట్ పూజ.. ఈ పండుగ సందర్భంగా పవిత్ర నదీ స్నానాలు చేసి, పూజలు చేస్తుంటారు. ఈ పూజల్లో భాగంగా కాళింది కుంజ్ సమీపంలో యమునా నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వెళ్లగా.. నదిలో విషపు నురగలు కనిపించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలుష్యమయమైన ఆ నీటిలోనే మహిళలు పవిత్ర స్నానాలు చేసి.. పూజ ముగించారు.
People take dip in Yamuna river near Kalindi Kunj in Delhi on the first day of #ChhathPuja amid toxic foam pic.twitter.com/nrmzckRgdq
— ANI (@ANI) November 8, 2021