
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT అంతగా నమ్మదగిన టెక్నాలజీ కాదని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. చాట్ జీపీటీలో లోపాలు తెలిసినప్పటికీ, అది భ్రమలకు గురిచేస్తుందని, తప్పుడు సమాచారం ఇస్తున్నప్పటికీ యూజర్లు ఎంతగానో నమ్ముతున్నారని సామ్ ఆల్ట్‌మాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
OpenAI పాడ్‌కాస్ట్‌లో ఆల్ట్మాన్ మాట్లాడుతూ ..చాట్‌జిపిటిపై ప్రజలకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది..కానీ మీరు అంతగా విశ్వసించాల్సిన టెక్నాలజీ కాదు.అది. వంట చిట్కాల నుంచి పేరెంట్స్ సలహా వరకు రోజువారీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రజలు AIని ఎక్కువగా ఉపయోగిస్తున్నక్రమంలో ఆల్ట్ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
AI స్మార్ట్‌గా అనిపిస్తుంది..కానీ ఎల్లప్పుడూ సరైనది కాదు..
ఆల్ట్‌మాన్ స్వయంగా దీనిని అనుభవించాడు. అతను తొలిసారి నాన్న అయినప్పుడు నిద్ర షెడ్యూల్‌లను ఎంచుకోవడం నుంచి డైపర్ దద్దుర్లు పరిష్కరించడం వరకు ChatGPTపై ఎక్కువగా ఆధారపడినట్టు చెప్పాడు. ఇది ఎల్లప్పుడూ సరిగ్గా జరగదని నన్ను నేను గుర్తు చేసుకోవలసి వచ్చింది అని ఆల్ట్మాన్ ఒప్పుకున్నాడు.
లోపలి నుండి మేల్కొలుపు పిలుపు
సామ్ ఆల్ట్మాన్ మాటలు ఒక మేల్కొలుపు కాల్లాంటిది. ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ AI ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాని సృష్టికర్త నుంచి వచ్చిన మాట మనం యంత్రం ద్వారా ఉత్పత్తి చేయబడిన కంటెంట్‌ను ఎలా ఉపయోగిస్తాం, ఎలా విశ్వసిస్తాం అనే దాని గురించి చర్చకు దారి తీసింది.
AI చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ దానిని దైవవాణిగా కాకుండా సహాయకుడిగా పరిగణించాలని ఆల్ట్ మాన్ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. గుడ్డిగా నమ్మడం తప్పుదారి పట్టించడమేకాకుండా ప్రమాదకరం అని చెబుతున్నారాయన. ఉత్పాదక AI అభివృద్ధి చెందుతూనే ఉన్నందున మన సందేహం కూడా అలాగే ఉండాలి అంటున్నారు ఆల్ట్మాన్
వాస్తవ ప్రపంచ తీర్పు..
AI సహాయకారిగా ఉన్నప్పటికీ అతిగా ఆధారపడటం ప్రమాదకరమని ఆల్ట్మాన్ నొక్కిచెప్పారు. మనం శక్తివంతమైన AI ప్రారంభంలో ఉన్నామని హెచ్చరించారు. మనం జాగ్రత్తగా లేకపోతే నమ్మకం అనేది వాస్తవాన్ని అధిగమిస్తుందన్నారు ఆల్ట్మాన్.
AI ని తెలివిగా ఉపయోగించాలి
ChatGPT ని సలహాల కోసం అడగడం సరైందే అయినప్పటికీ అది మీ జీవితంలో తుది నిర్ణయం తీసుకునే వ్యక్తి కాకూడదు. AI అనేది ఒక సాధనం..వాస్తవ ప్రపంచ ఆలోచన లేదా నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆల్ట్మాన్ చెప్పినట్లుగా నమ్మకం మంచిది..కానీ AI ని గుడ్డిగా నమ్మడం ? అంతగా మంచిది కాదు.