చలికాలం గుండె సేఫ్గా

చలికాలం గుండె సేఫ్గా

చలి ఎక్కువైతే గజగజా వణకడమే కాదు... ఒక్కోసారి గుండె కూడా ఆగిపోతుందని. తెలుసా? తగ్గుతున్న టెంపరేచర్ వల్ల రాత్రికి రాత్రే గుండె ఆగిన సందర్భాలు ఇటీవలఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు చలికి, గుండెకు ఏంటి సంబంధం? చలికాలం గుండె సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కార్డియాలజిస్ట్ వినోద్ కుమార్ వివరించారిలా..

వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు శరీరంలోని చాలా.. అవయవాల పనితీరులో మార్పులొస్తాయి. అందులో గుండె కూడా ఒకటి. గుండె సమస్యలు ఉన్నవాళ్లు మిగతా రోజులతో పోలిస్తే చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14 నుంచి 20 శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే టెంపరేచర్ తగ్గడం వల్ల రక్త ప్రసరణలో మార్పులొచ్చి కొన్నిసార్లు గుండె ఫెయిల్ అవుతుంది.

కారణాలివే..

చలికాలంలో కామన్ గానే బద్ధకం పెరుగుతుంది. దానివల్ల లేట్ నిద్రలేస్తుంటారు చాలామంది. చలికి భయపడి వ్యాయామాలు మానేస్తుంటారు. మిగతా రోజులతో పోలిస్తే.. చలికాలంలో ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు. అలా చలికాలంలో సాధారణంగానే ఒంట్లో కదలికలు తగ్గుతాయి. దాంతో రక్తప్రసరణ మందగిస్తుంది. హార్ట్ రేట్, బీపీ వంటివి పెరుగుతాయి. ఇది కొన్నిసార్లు గుండెపోటుకి దారి తీయొచ్చు. అలాగే కొంతమందిలో చలికి రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ సాఫీగా
జరగదు. గుండెకు రక్తం సరిగా అందదు. దాంతో గుండె ఎక్కువసార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. గుండెపై ఒత్తిడి పడి బీపీ పెరుగుతుంది. అది సడెన్ హార్ట్ ఎటాక్ కు దారి తీయొచ్చు. వీటితోపాటు చలికాలంలో ఎక్కువ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఒబెసిటీ పెరుగుతుంది. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుంటుంది. దాంతో గుండెకు రక్తం అందక హార్ట్ ఎటాక్, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందక ఆయాసం వస్తుంది. ఇది మరీ ఎక్కువైతే గుండెపోటు రావొచ్చు.

తెల్లవారుజామున ఎక్కువ

చలికాలంలో శరీరానికి చల్లదనం తగలకుండా జాగ్రత్తపడితే గుండెపోటు, బీపీ లాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దానికోసం శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బట్టలు, స్వెటర్స్, షాల్స్ వేసుకోవాలి. చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఈ సీజన్లో ముఖ్యంగా తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి రాత్రి నిద్రపోయేటప్పుడే రా గది వెచ్చగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. చల్లగాలులు రాకుండా కిటికీలు మూసేయాలి. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉంటే... డాక్టర్ను కలవాలి. ఈ సీజన్లో వాతా వరణంలో సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుంది.

కాబట్టి వీలైనంత వరకూ బయట పొల్యూషన్కు ఎక్స్పోజ్ అవ్వకూడదు. బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్లు టైంకి మందులు వేసుకోవాలి. ఇంటి వాతావరణం వెచ్చగా ఉండేలా హీటర్లు వాడాలి. చన్నీళ్లతో స్నానంచేయకూడదు. చలికాలం లో తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. అయితే చలిలో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయకుండా ఇంట్లోనే ట్రెడ్ మిల్ం లాంటి వ్యాయామాలు చేయాలి. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ మానేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వేడిగా ఉండే సూప్స్, డ్రింక్స్ లాంటివి. తాగుతుండాలి. డయాబెటిస్, ఒబెసిటీ, బీపీ అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మానుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

కొంతమందిలో హై బీపీ లక్షణాలు బయటికి కనిపించవు. కాబట్టి తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి.. పడిపోతున్నఉష్ణోగ్రతల వల్ల హైపోథర్మియా, ఫ్రాస్ట్ బైట్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఛాతిలో బరువుగా ఉండడం, చెమట, ఒళ్లు నొప్పులు, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి.

వీళ్లలో ఎక్కువ

గుండె జబ్బులతో బాధపడేవాళ్లు, ఆస్తమా, ఊపిరితిత్తుల జబ్బులతో ఇబ్బంది పడేవాళ్లు, హై బీపీ, దయాబెటిస్ ఉన్నవాళ్లు చలికాలం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి వాళ్లు చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రక్తనాళాలు, ఊపిరితిత్తులు త్వరగా
ఎఫెక్ట్ అవుతాయి. అలాగే చిన్నపిల్లలు, వయసు పైబడినవాళ్లపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్లతో పాటు చల్లని ప్రాంతాల్లో నివసించే వాళ్లు, ఇల్లులేక రోడ్లపై ఉండేవాళ్లలో కూడా చలికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే చలికాలంలో ఆల్కహాల్ ఎక్కువగా తాగేవాళ్లకు ఆ మత్తు వల్ల చలి అంతగా తెలియదు. దాంతో శరీర ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముంది. తాగినప్పుడు బీపీ, హార్ట్ రేట్ వంటివి పెరుగుతున్నా వాళ్లుదాన్ని గుర్తిం చలేరు. అలా ఆల్కహాల్ ఎక్కువగా తాగేవాళ్లు కూడా చలికాలంలో గుండెపోటు బారిన పడుతుంటారు.

- డా. వినోద్ కుమార్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్